పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్ : పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. షహీన్ నగర్‌లో అమర్ హంసన్ అనే రౌడీషీటర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తమతో తెచ్చుకున్న రాడ్లతో అతని తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. స్థానికులు ఈ ఘటనతో భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.