'ఆ నివేదిక నా దగ్గర లేదు' | rishiteswari case report pending at CM, says ganta srinivasa rao | Sakshi
Sakshi News home page

'ఆ నివేదిక నా దగ్గర లేదు'

Sep 23 2015 1:54 PM | Updated on Sep 3 2017 9:51 AM

'ఆ నివేదిక నా దగ్గర లేదు'

'ఆ నివేదిక నా దగ్గర లేదు'

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నివేదిక తన దగ్గర లేదని, సీఎం దగ్గర పెండింగ్ లో ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

హైదరాబాద్: యూనివర్సిటీల్లో ప్రతి సోమవారం డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక పరిశీలించి యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తామని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. నాణ్యమైన విద్య కోసమే ఈ బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు.

విజయవాడలోని మేరీ స్టెల్లా విద్యార్థిని భాను ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో నివేదిక అందలేదని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నివేదిక తన దగ్గర లేదని, సీఎం దగ్గర పెండింగ్ లో ఉందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement