పోలీసులకే టోపీ పెట్టిన ప్రభుత్వం: రేవంత్ | revanth reddy fired on cm kcr and telangana government | Sakshi
Sakshi News home page

పోలీసులకే టోపీ పెట్టిన ప్రభుత్వం: రేవంత్

Oct 26 2016 3:14 AM | Updated on Aug 21 2018 5:51 PM

పోలీసులకే టోపీ పెట్టిన ప్రభుత్వం: రేవంత్ - Sakshi

పోలీసులకే టోపీ పెట్టిన ప్రభుత్వం: రేవంత్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా హోంగార్డులకు, పోలీసులకు కూడా ప్రభుత్వం టోపీ పెట్టిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా హోంగార్డులకు, పోలీసులకు కూడా ప్రభుత్వం టోపీ పెట్టిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆందోళన సందర్భంగా గాయపడిన హోంగార్డులను మంగళవారం పరామర్శించిన ఆయన... పోలీసులకు జీతాలు పెంచుతామని, 8 గంటల పని వేళ లు ఉంటాయని, వారాంతపు సెలవులు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇంకా హక్కుల కోసం కాళ్లు పట్టుకోకుండా.. కేసీఆర్ వెళ్లే దారిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తీసేసి, ట్రాఫిక్ జామ్ చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement