రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత | ravela Sushil case Cancellation | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత

Apr 26 2016 3:07 AM | Updated on Sep 3 2017 10:43 PM

ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది.

సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి రాజా ఇలంగో సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుశీల్ డ్రైవర్ మణికొండ రమేష్‌బాబుపై నమోదైన కేసును కూడా కొట్టి వేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని పేర్కొంటూ సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ ఇలంగో విచారించారు. పిటిషనర్లు, ఫిర్యాదుదారులు రాజీకి రావడంతో కే సును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫాతిమా బేగం పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు సుశీల్, అతని డ్రైవర్‌పై గత నెలలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement