ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం | Rajendra nagar mla prakash goud takes on officials | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఎమ్మెల్యే ఆగ్రహం

Aug 11 2015 1:36 PM | Updated on Sep 3 2017 7:14 AM

ప్రొటోకాల్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ ఉన్నతాధికారులపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు.

రాజేంద్రనగర్ : ప్రొటోకాల్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదంటూ ఉన్నతాధికారులపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ప్రకాష్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

స్థానికంగా రూ.82 లక్షలతో నిర్మించిన కొత్త సీసీరోడ్డును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు పేరుకు బదులు ఈ కార్యక్రమంతో సంబంధం లేని వారి పేరు శిలఫలకంపై ఉండటంతో ప్రకాష్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించడం లేదంటూ ఉన్నతాధికారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement