మరో 3 రోజుల పాటు వర్షాలు! | Rains in andhra pradesh and telangana | Sakshi
Sakshi News home page

మరో 3 రోజుల పాటు వర్షాలు!

May 10 2016 10:47 AM | Updated on Sep 4 2018 5:02 PM

ఒడిశా నుంచి తెలంగాణ మీదగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి అవరించి ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.

హైదరాబాద్ : ఒడిశా నుంచి తెలంగాణ మీదగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి అవరించి ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. అలాగే రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్,  నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు భారీగా గండిపేటలోకి చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement