మరో నాలుగు రోజులు వర్షాలు | rains for four more days, hyderabad meteorological department announces | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వర్షాలు

May 11 2016 4:17 AM | Updated on Sep 4 2018 5:02 PM

రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

- మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం

- రామగుండంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండురోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

మోమిన్‌పేటలో 5, నల్లగొండ, చేవెళ్లలో 4 సెంటీమీటర్ల చొప్పున, హకీంపేట్‌లో 2.1, మహేశ్వరంలో 3.4, మేడ్చల్‌లో 1.8, సరూర్‌నగర్‌లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మంగళవారం కొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 41, ఖమ్మం, హన్మకొండలో 40 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

 నమోదైన ఉష్ణోగ్రతలు

 

 ప్రాంతం             ఉష్ణోగ్రత

 రామగుండం        41.0

 ఖమ్మం              40.0

 హన్మకొండ           39.5

 భద్రాచలం                   38.6

నిజామాబాద్           38.5

 ఆదిలాబాద్             38.3

 నల్లగొండ               38.0

 మెదక్                  36.8

Advertisement
 
Advertisement
Advertisement