హెచ్సీయూ చేరుకున్న రాహుల్ | rahul gandhi reaches hcu | Sakshi
Sakshi News home page

హెచ్సీయూ చేరుకున్న రాహుల్

Jan 19 2016 12:53 PM | Updated on Sep 3 2017 3:55 PM

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు.

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాహుల్.. అక్కడి నుంచి నేరుగా హెచ్సీయూకు వెళ్లారు. ఆయన వెంట దిగ్విజయ్ సింగ్ వచ్చారు.  బేగంపేటలో రాహుల్ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

హెచ్సీయూలో రాహుల్.. విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడనున్నారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలు, హెచ్సీయూలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకోనున్నారు. రాహుల్ రాక సందర్భంగా హెచ్సీయూలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement