'కోదండరామ్‌కు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి' | professor haragopal comments on trs government | Sakshi
Sakshi News home page

'కోదండరామ్‌కు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి'

Jun 9 2016 6:06 PM | Updated on Jul 29 2019 2:51 PM

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ళలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్న కోదండరామ్‌పై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదని..

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ళలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్న కోదండరామ్‌పై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదని పొరహక్కుల సంఘం నేత హరగోపాల్‌ హితవు పలికారు. కోదండరామ్‌ చేసిన విమర్శల్లో వాస్తవాలను గ్రహించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌పై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement