'మాకు కేటాయించిన సీట్లపై నీ పెత్తనమేంటి బాబు'

'మాకు కేటాయించిన సీట్లపై నీ పెత్తనమేంటి బాబు' - Sakshi


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీతో పొత్తు అనంతరం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యవహర శైలిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రాంతాలలో టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి.... అందులోభాగంగా తమ పార్టీకి టీడీపీ కొన్ని స్థానాలు కేటాయించింది. అయితే తమకు కేటాయించిన సీట్లలో చంద్రబాబు జోక్యం చేసుకోవడంపై జవదేకర్ ధ్వజమేత్తారు.


 


బీజేపీతో పొత్తు పెట్టుకునే వరకు తమ పార్టీ అగ్రనాయకులను చంద్రబాబు నిద్రపోనివ్వలేదని, అలాంటి ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాత అభ్యర్థుల కేటాయింపుల్లో జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలా అయితే పొత్తును తెగతెంపులు చేసుకుని... అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో అన్ని లోక్సభ స్థానాలలో బీజేపీ అభ్యర్థులను పోటీకి దింపుతామని జవదేకర్ ఈ సందర్బంగా చంద్రబాబును హెచ్చరించారు. బీజేపీకి కేటాయించిన స్థానాల అభ్యర్థుల అంశాన్ని చంద్రబాబు గందరగోళం చేస్తుండటంతో బీజేపీ ఆగ్రనాయకత్వం ప్రకాశ్ జావదేకర్ ను ఆగమేఘాలపై హైదరాబాద్ పంపిన విషయం తెలిసిందే.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top