కొత్త జిల్లాల్లో జనాభా వివరాలు వెల్లడి.. | Population of new districts announced in Telangana state | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల్లో జనాభా వివరాలు వెల్లడి..

Sep 15 2016 7:22 PM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల్లో జనాభా వివరాలు వెల్లడి.. - Sakshi

కొత్త జిల్లాల్లో జనాభా వివరాలు వెల్లడి..

తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో జనాభాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో జనాభాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. జిల్లాల్లో మొత్తం జనాభా 3 కోట్ల 50 లక్షల 50 వేల 137 ఉండగా, ఎస్సీ జనాభా 15 శాతం, ఎస్టీ 9 శాతం, మైనార్టీ 14 శాతం ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్‌లో అత్యధిక జనాభా 39 లక్షల 43వేల 323 కాగా, ప్రొ. జయశంకర్‌ జిల్లాలో అత్యల్ప జనాభా 6 లక్షల 54వేల 853 మంది జనాభా ఉన్నట్లు తేలింది.

మల్కాజ్‌గిరిలో 24 లక్షల 40వేల 073, శంషాబాద్‌లో 20 లక్షల 51 వేల 130 జనాభా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కొమురం భీం జిల్లాలో అత్యధికంగా 22 శాతం ఎస్సీ జనాభా ఉండగా, మహబుబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 38 శాతం ఎస్టీ జనాభా, హైదరాబాద్‌లో అత్యధికంగా 46 శాతం మైనార్టీ జనాభా ఉన్నట్టు వెల్లడయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement