నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్.. | police cordon search in sr nagar | Sakshi
Sakshi News home page

నగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్..

Jun 23 2016 7:37 AM | Updated on Aug 21 2018 5:54 PM

ఎస్ఆర్ నగర్ పోలీసులు బుధవారం రాత్రి అంబేద్కర్‌నగర్, జయప్రకాశ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు

హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీసులు బుధవారం రాత్రి అంబేద్కర్‌నగర్, జయప్రకాశ్‌నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మొత్తం 412 ఇళ్లను సోదా చేయగా అందులో 17 హాస్టళ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 61 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నేపాల్ దేశంతోపాటు వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. అలాగే, ఎలాంటి పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement