
నయీం గెస్ట్ హౌస్ పై దాడి : భారీగా నగదు స్వాధీనం
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీం ఇళ్లు, గెస్ట్ హౌస్ లతో పాటు బంధువుల ఇళ్లలో పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీం ఇళ్లు, గెస్ట్ హౌస్లతో పాటు బంధువుల ఇళ్లలో పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. వనస్థలిపురంలోని నయీం గెస్ట్ హౌస్పై సోమవారం పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ తెలిపారు. రూ.38.50 లక్షలు, 3 పిస్తోళ్లతో పాటు 22 రౌండ్ల బుల్లెట్లు, 25 సేల్స్ డీడ్ డాక్యుమెంట్లు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మారుపేరుతో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసినట్లు ఇక్బాల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నయీం బంధువుల ఇళ్లలో జరిపిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తులను గుర్తించడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నయీం మృత దేహానికి పోస్ట్ మార్టం పూర్తి:
షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం ను నిర్వహించారు. నయీం మృత దేహంలో నాలుగు బుల్లెట్లను గుర్తించారు.రాత్రికి లేదా రేపు ఉదయం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.