శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన | passengers protests in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Apr 17 2016 9:35 AM | Updated on Apr 7 2019 3:28 PM

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన - Sakshi

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన

తమను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయిందంటూ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : తమను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయిందంటూ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.... హైదరాబాద్ నుంచి కొచ్చికి ఇండిగో విమాన సర్వీసులో వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అయితే అప్పటికి కొన్ని నిమిషాల ముందే విమానం వెళ్లిపోయిందని సదరు ప్రయాణికులకు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో అధికారులపై ప్రయాణీకులు మండిపడ్డారు. ముందుగా టిక్కెటు కొనుగోలు చేసిన విమానం ఎందుకు వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రయాణీకులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎయిర్పోర్టు పోలీసులు రంగంలోకి దిగి... ప్రయాణికులకు శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement