'రౌడీలా మాట్లాడుతున్నాడు' | P. Narayana takes on mudragada padmanabham | Sakshi
Sakshi News home page

'రౌడీలా మాట్లాడుతున్నాడు'

Mar 6 2016 9:16 AM | Updated on Mar 23 2019 8:59 PM

'రౌడీలా మాట్లాడుతున్నాడు' - Sakshi

'రౌడీలా మాట్లాడుతున్నాడు'

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రౌడీలా మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని భ్రష్టుపట్టిస్తున్నడాని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆరోపించారు.

హైదరాబాద్ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రౌడీలా మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని భ్రష్టుపట్టిస్తున్నడాని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో పి.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ... మూడు నిమిషాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోస్తానంటూ ముద్రగడ రౌడిలా మాట్లాడుతున్నరని విమర్శించారు. కాపులను అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు చంద్రబాబు ప్రభుత్వం నడవదంటూ ముద్రగడను ఎద్దేవా చేశారు.  రాజధాని భూముల గురించి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారని ముద్రగడను మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజ్యసభ పదవికి ఆశపడి కాపు ఉద్యమాన్ని పక్కదోవపట్టిస్తున్నారని ముద్రగడపై నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement