తమిళనాడుకు మన బియ్యం: ఈటల

Our rice to Tamil Nadu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని (బాయిల్డ్‌ రైస్‌) ఎగుమతి చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థతో పాటు రైతాంగానికి, మిల్లర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరమవుతుందని, ఈ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అదనంగా రూ.30 రైతులకు చెల్లించి కొనుగోలు చేయడానికి మిల్లర్లను ఒప్పించామని వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top