మల్లన్నసాగర్ బాధితుల కోసం బీజేపీ ధర్నా | Opposition Leaders Protest Against Mallanna Sagar Project Land Acquisition | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్ బాధితుల కోసం బీజేపీ ధర్నా

Jun 22 2016 11:20 AM | Updated on Mar 28 2019 8:37 PM

న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది.

హైదరాబాద్: న్యాయమైన పరిహారం ఆందోళన చేస్తున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీజేపీ మద్దతు తెలపనుంది. బుధవారం సాయంత్రం తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినంత సాయం అందించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement