మలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ షురూ | online trading starts in malakpet agriculture market | Sakshi
Sakshi News home page

మలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ షురూ

Apr 15 2016 3:36 AM | Updated on Aug 20 2018 9:16 PM

వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌పై ప్రధాని ఉపన్యాసాన్ని వింటున్న అధికారులు, రైతులు, వ్యాపారులు - Sakshi

వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌పై ప్రధాని ఉపన్యాసాన్ని వింటున్న అధికారులు, రైతులు, వ్యాపారులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఆన్‌లైన్ ట్రేడింగ్ విధానానికి ఎంపికైన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వ్యవసాయ శాఖ

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఆన్‌లైన్ ట్రేడింగ్ విధానానికి ఎంపికైన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వ్యవసాయ శాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు దేశంలో ఎక్కడ నుంచైనా ఆన్‌లైన్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చన్నారు.

గిట్టుబాటు ధర ఎక్కడ అధికంగా ఉంటే అక్కడ అమ్ముకునే విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులు దళారుల బారినపడి మోసాలు, నష్టాలకు గురికాకుండా నేరుగా రైతే వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రధాని ఉపన్యాసాన్ని మార్కెట్‌లోని రైతులు, వ్యాపారులు, అధికారులు విన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎల్లయ్య, వెంకట్ రెడ్డి, వ్యాపారులు వంజరి వినోద్, రాజేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement