ఆన్లైన్ వ్యభిచార ముఠా అరెస్ట్ | online prostitutes gang busted in hyderabad city | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ వ్యభిచార ముఠా అరెస్ట్

Oct 7 2016 1:00 PM | Updated on Sep 4 2017 4:32 PM

ఎస్కార్ట్ పేరుతో ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్: ఎస్కార్ట్ పేరుతో ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. ఎస్కార్ట్ పేరుతో సాగిస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ముఠా సభ్యులు కారులో తప్పించుకునే యత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసు వాహనాన్ని వారు ఢీకొట్టారు.

ఈ ఘటనలో పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో కారులోని ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్లు, 1 ల్యాప్‌టాప్, ఒక హోండాసీటీ కారు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై వ్యభిచారం కేసుతోపాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement