online prostitutes
-
ఆన్లైన్ వ్యభిచారుల అరెస్ట్
సాక్షి, మేడ్చల్: నగరంలో ఆన్లైన ద్వారా నిర్వహిస్తున్న వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దమ్మాయిగూడ పీఎస్రావు నగర్లో గల ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను పట్టుకుని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ వ్యభిచార ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఎస్కార్ట్ పేరుతో ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాగుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. ఎస్కార్ట్ పేరుతో సాగిస్తున్న ఈ వ్యవహారానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ముఠా సభ్యులు కారులో తప్పించుకునే యత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసు వాహనాన్ని వారు ఢీకొట్టారు. ఈ ఘటనలో పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో కారులోని ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్, ఒక హోండాసీటీ కారు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులపై వ్యభిచారం కేసుతోపాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.