
సాక్షి, మేడ్చల్: నగరంలో ఆన్‌లైన ద్వారా నిర్వహిస్తున్న వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా పై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దమ్మాయిగూడ పీఎస్‌రావు నగర్‌లో గల ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను పట్టుకుని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.