ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి | one killed in road accident in erragadda | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Jul 20 2016 7:39 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ : ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న స్కూటర్ను వెనుక నుంచి వేగంగా వచ్చి... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వెనక కూర్చున వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement