వైద్యురాలిపై అఘాయిత్యం | On physician sexual assault | Sakshi
Sakshi News home page

వైద్యురాలిపై అఘాయిత్యం

Oct 15 2015 1:12 AM | Updated on Jul 23 2018 9:13 PM

మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి..
 నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

 
అత్తాపూర్: మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వైద్యురాలు (32) తన కుటుంబసభ్యులతో కలిసి రాజేంద్రనగర్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామంలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటోంది. ఈమె ఇంటికి ఎదురు ఫ్లాట్‌లో రాజస్థాన్‌కు చెందిన మనోజ్(30) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంటున్నాడు. 

రెండు రోజుల క్రితం వైద్యురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన మోజ్ ఆమెతో మాటాలు కలిపాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే వైద్యురాలు మత్తులోకి జారుకోగా లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా, బాధితురాలు బుధవారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌కు వచ్చి తనపై మనోజ్ జరిపిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement