నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలను డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ మాదవరం తెలిపారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలను డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ మాదవరం తెలిపారు. ఆయన సోమవారం ఎల్‌బీస్టేడియంలోని ఫతేమైదాన్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా మహిళలలో గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, మహిళల భద్రత, గృహ హింసలాంటి పలు అంశాలపై అవగాహన కల్పించే విధంగా డిసెంబర్ 1న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి 5కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
7న విదేశాలలో విద్యావకాశాలు, మహిళల ఫోరం సదస్సు, మహిళల సాధికారత, లైంగిక దాడి, పసిపిల్లల అమ్మకానికి సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు తదితర అంశాలపై శిల్పారామంలో సదస్సు జరుగుతుందని వివరించారు. అనంతరం 5కె రన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.