పెళ్లయిన మూడు రోజులకే..! | nri fled away to uk 3 days after marrying girl | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మూడు రోజులకే..!

Feb 16 2016 3:02 AM | Updated on Sep 3 2017 5:42 PM

పెళ్లయిన మూడు రోజులకే..!

పెళ్లయిన మూడు రోజులకే..!

పెద్దల కాలంలో పెళ్లి చేయాలంటే అవతలివైపు కుటుంబ పరిస్థితులు, నేపథ్యం...ఇలా అన్నీ చూసి జరిపేవారు.

సాక్షి, హైదరాబాద్: పెద్దల కాలంలో పెళ్లి చేయాలంటే అవతలివైపు కుటుంబ పరిస్థితులు, నేపథ్యం...ఇలా అన్నీ చూసి జరిపేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. నేటి యువతీయువకులు నేరుగా మ్యాట్రిమోనీలను సంప్రదించి తగిన వారిని చూసుకుంటున్నారు. వేయి అబద్ధాలాడైనా ఒకపెళ్లి జరిపించాలన్నట్లు కాసులకోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పి వారిని పెళ్లికి ఒప్పిస్తారు. కొంతమంది యువత అక్కడే పరిచయాలు చేసుకుని, నచ్చితే ఎవర్నీ సంప్రదించకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. అలా మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకుని మూడు రోజులకి మోజు తీరగానే విదేశాలకు చెక్కేశాడు ఓప్రబుద్ధుడు. ఈఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... జిల్లాకు చెందిన ప్రశాంతి(26) అనే యువతి హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన సంగెపు శ్రవణ్‌కుమార్ మ్యాట్రిమోని ద్వారా ఓ ఎన్నారైని కలుసుకుంది. ఇద్దరూ కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కేవలం మూడంటే మూడురోజులు గడిపిన ఎన్నారై చెప్పాపెట్టకుండా బ్రిటన్ పారిపోయాడు. ఈ విషయంపై బాధితురాలు ప్రశాంతి రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసింది. అతను వెళ్లిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధించి బయటకు గెంటేశారని తెలిపింది. తల్లిదండ్రుల సహాయంతో తనను మోసగించిన ఎన్నారైపై వరంగల్ కమిషనరేట్‌లో ఫిర్యాదుచేయగా అక్కడి ఏసీపీ, సీఐలు కేసు పట్టించుకోకపోగా ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని డీజీపీతో గోడు వెల్లబోసుకుంది. ఈవిషయంపై స్పందించిన డీజీపీ అనురాగ్‌శర్మ... బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు తప్పుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement