నిబంధనల మేరకే డబ్బులిచ్చాం | no fraud in fish nursery issue | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే డబ్బులిచ్చాం

Feb 1 2017 4:25 AM | Updated on Sep 5 2017 2:34 AM

చేప పిల్లల పంపిణీదారులకు నిబంధనల మేరకే డబ్బులు చెల్లించామని మత్స్యశాఖ తెలిపింది.

‘మాయా మశ్చీంద్ర’పై మత్స్యశాఖ వివరణ
సాక్షి, హైదరాబాద్‌: చేప పిల్లల పంపిణీదారులకు నిబంధనల మేరకే డబ్బులు చెల్లించామని మత్స్యశాఖ తెలిపింది. చేప పిల్లల పంపిణీలో అవకతవకలపై జనవరి 30న ‘సాక్షి’లో ‘మాయా మశ్చీంద్ర’ పేరిట ప్రచురితమైన కథనంపై మత్స్యశాఖ కమిషనర్‌ మంగళవారం వివరణ ఇచ్చారు. చేప పిల్లల ఉచిత పంపి ణీకి ప్రభుత్వం రూ.48.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ‘‘చేప పిల్లల సేకరణకు జిల్లాల వారీగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీల ద్వారా ఈ–టెండర్లు పిలిచాం.

జిల్లా మత్య్స సహకార సంఘ అధ్యక్షు లు, చేప పిల్లల పంపిణీదారులు, ఇతర మత్స్య సంఘాల ప్రతినిధులతో సచివా లయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమావేశం నిర్వహించారు. చేప పిల్లల్ని లెక్కించాల్సిన పద్ధతి, పంపిణీ, పరిమాణం, సంఖ్య తదితర అంశాల పర్యవేక్షణ ఈ సంఘం సభ్యులదేనని సూచించారు. ‘‘ఒక చేపపిల్లకు రూ.81 పైసల చొప్పున ధర నిర్ణయించాం. చేప పిల్లల నాణ్యత నిర్ధారణకు సాంకేతిక అధికారులతో ఒక కమిటీ, వాటిని లెక్కించేందుకు సంఘ ప్రతినిధులతో మరో కమిటీ వేశాం’’ అని కమిషనర్‌ వివరించారు. మొత్తం 3,939 నీటి వనరులలో రూ.23 కోట్ల విలువైన 27.85 కోట్ల చేప పిల్లలను వదిలామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement