'రామారావుది అరుదైన వ్యక్తిత్వం' | Nirmala sitharaman pay tributes to v ramarao | Sakshi
Sakshi News home page

'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'

Jan 17 2016 7:45 PM | Updated on Sep 3 2017 3:48 PM

'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'

'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'

బిజేపీ సీనియర్ నేత, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్ వి. రామారావు అరుదైన వ్యక్తిత్వం గల వారని కేంద్రవాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

హైదరాబాద్ : బిజేపీ సీనియర్ నేత, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్ వి. రామారావు అరుదైన వ్యక్తిత్వం గల వారని కేంద్రవాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కాలనీలోని రామారావు మృతదేహాన్ని ఆయన నివాసంలో సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ... జనసంఘ్ ప్రారంభ సమయంలో వి.రామారావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీకి రామారావు చేసిన సేవలను ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ ప్రస్తుతించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. రామారావు మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement