breaking news
v ramarao
-
'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'
-
'రామారావుది అరుదైన వ్యక్తిత్వం'
హైదరాబాద్ : బిజేపీ సీనియర్ నేత, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్ వి. రామారావు అరుదైన వ్యక్తిత్వం గల వారని కేంద్రవాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కాలనీలోని రామారావు మృతదేహాన్ని ఆయన నివాసంలో సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ... జనసంఘ్ ప్రారంభ సమయంలో వి.రామారావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీకి రామారావు చేసిన సేవలను ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ ప్రస్తుతించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. రామారావు మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. -
'పార్టీలు వేరైనా.. మంచి స్నేహితులం'
చెన్నై: మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు మృతిపట్ల తమళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం తనకు తీరని బాధను కలిగించిందన్నారు. ఈ సందర్భంగా రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసన మండలిలో తమది 17 ఏళ్ల అనుబంధం అని రోశయ్య అన్నారు. పార్టీలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. జన్ సంఘ్ లో పనిచేసిన అనంతరం బీజేపీలోకి వెళ్లినా వీ రామారావు సేవలు మాత్రం అమోఘం అని రోశయ్య అన్నారు.