జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం | new scam in GHMC | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం

May 5 2017 6:38 PM | Updated on Sep 29 2018 5:10 PM

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం - Sakshi

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం

జీహెచ్‌ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలో​అవినీతి పెరిగిపోయింది.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలో​అవినీతి పెరిగిపోయింది. చేయని పనులకు నకిలీ బిల్లులతో కోట్లల్లో దిగమింగుతున్నారు. తాజాగా నాలాల్లో పూడికతీత పేరుతో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. మురుగుకాల్వల్లో తొలగించిన పూడికను టూ వీలర్స్..4 వీలర్స్ లో తరలించినట్టు కాంట్రాక్టర్లు కోటి పద్దెనిమిది లక్షల రూపాయల మేర నకిలీ బిల్లులు సృష్టించారు.

అనుమానం వచ్చిన అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో జీహెచ్ఎంసీ ఏఈల హస్తం ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సంబంధం ఉన్న 12మంది ఏఈలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement