నేడే నీట్-2 పరీక్ష | NEET-2 exam to be held today | Sakshi
Sakshi News home page

నేడే నీట్-2 పరీక్ష

Jul 24 2016 3:52 AM | Updated on Oct 20 2018 5:44 PM

నేడే నీట్-2 పరీక్ష - Sakshi

నేడే నీట్-2 పరీక్ష

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్-2 కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష
-     యాజమాన్య కోటా
-     మెడికల్ సీట్లకు ఈ పరీక్షే కీలకం

 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)-2’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనుండడంతో ఈ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లోని మెడికల్ సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసెట్-2 నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
 ఆ కన్వీనర్ కోటాలో అవకాశం లభించని వారంతా ‘నీట్-2’కు పోటీ పడుతున్నారు. నీట్-2 ర్యాంకులతో రాష్ట్రం సహా దేశంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లోని సీట్ల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక నీట్-2 ప్రవేశ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 27 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థుల హాల్‌టికెట్లలో పొందుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement