'కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎందుకో అంత ఆసక్తి?' | Nayeem encounter issue raised in telangana legislative council | Sakshi
Sakshi News home page

'కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎందుకో అంత ఆసక్తి?'

Aug 30 2016 7:06 PM | Updated on Mar 18 2019 7:55 PM

శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గ్యాంగ్ స్టర్ నయీం కేసు అంశాన్ని ప్రస్తావించారు.

హైదరాబాద్ : శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మంగళవారం గ్యాంగ్ స్టర్ నయీం కేసు అంశాన్ని ప్రస్తావించారు. నయీం డైరీని బయటపెట్టాలని, ఆ కేసులో సంబంధం ఉన్నవారందరి పేర్లు బయటపెట్టాలని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఇవాళ సభలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తూ కేసులో సంబంధించిన అన్ని అంశాలను సభ ముందు ఉంచుతామని తెలిపారు.

అలాగే నయీం కేసులో కోమటిరెడ్డి సోదరులకు ఎందుకో అంత ఆసక్తి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. నయీం ఎన్కౌంటర్పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమత్రి ఆదేశాల మేరకే నయీం ఎన్కౌంటర్ జరిగిందా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement