'రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దు' | nagi reddy takes on tdp govt | Sakshi
Sakshi News home page

'రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దు'

Jul 5 2016 1:42 PM | Updated on Aug 10 2018 6:21 PM

పాస్ బుక్, టైటిల్ డీడ్ లేకుండా భూముల హక్కుల బదలాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : పాస్ బుక్, టైటిల్ డీడ్ లేకుండా భూముల హక్కుల బదలాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో నాగిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే  అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు సర్కార్ నిర్ణయం వల్ల ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రైతు సంఘాలతో కలసి ఉద్యమిస్తామని నాగిరెడ్డి హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయంపై మొండిగా వ్యవహరించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి నాగిరెడ్డి హితవు పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement