
ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది: నాగం
ఎంసెట్-2లీకేజీలో బ్రోకర్లను అరెస్టు చేస్తూ టైంపాస్ చేస్తోందని నాగం ప్రభుత్వంపై మండిపడ్డారు.
హైదరాబాద్: ఎంసెట్-2లీకేజీకి కారకులంటూ బ్రోకర్లను అరెస్టు చేస్తూ టైంపాస్ చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వెంటనే అధికారులను, మంత్రులను బాధ్యుల్ని చేస్తూ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పారు. లీకేజీకి బాధ్యతవహిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.