
కేసీఆర్‌ను ఆవహించిన నిజాం
సీఎం కేసీఆర్‌ను నిజాం నవాబు ఆవహించాడని, అందుకే నైజాం పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను నిజాం నవాబు ఆవహించాడని, అందుకే నైజాం పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైన స్వాతంత్య్ర దినమని అన్నారు. తెలంగాణలోనూ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోనీయకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని స్కీముల్లోనూ స్కాములే ఉన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపైనే పోరాడుతున్నానని.. ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదన్నారు. డ్రగ్స్ కేసులో ఏం చేశా రో చెప్పాలన్నారు. నేరేళ్ల ఘటనపై విచా రణ జరపాలని, మంత్రి కేటీఆర్‌పై, ఎస్పీ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.