సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి | music director shashi preetam attacked by bhanu prasad | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి

Apr 1 2016 6:41 PM | Updated on Sep 3 2017 9:01 PM

సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి

సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి

ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి జరిగింది. శశిప్రీతమ్ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్పై దాడి జరిగింది. శశిప్రీతమ్ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు.  దాడిలో శశిప్రీతమ్ ముఖానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అతడి  ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఐపీసీ 341,323,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా  2013లో రూరల్ డెవలప్‌మెంట్ డాక్యుమెంటరీ కాంట్రాక్ట్ విషయంలో భానుప్రసాద్, శశిప్రీతమ్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్టు శశిప్రీతమ్‌కు దక్కడంతో  అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భానుప్రసాద్ ...శశిప్రీతమ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన శశిప్రీతమ్...పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

Advertisement
 
Advertisement
Advertisement