రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కోదాడ మున్సిపల్ కమిషనర్ మాలోజీ నాయక్ బెల్లంపల్లి కమిషనర్‌గా, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకన్న.. మిర్యాలగూడ కమిషనర్‌గా, మిర్యాలగూడ కమిషనర్ అమరేందర్‌రెడ్డి కోదాడ కమిషనర్‌గా, సత్తుపల్లి కమిషనర్ శ్రీనివాస్, దేవరకొండ మున్సిపల్ కమిషనర్‌గా, దేవరకొండ కమిషనర్ స్వామి.. సత్తుపల్లి కమిషనర్‌గా బదిలీ కానున్నారు. వీరి బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆమోదించిన వెంటనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.