ముఖేష్ గౌడ్కు కీలక బాధ్యతలు? | Mukesh Goud's re entry to strengthen congress in GHMC | Sakshi
Sakshi News home page

ముఖేష్ గౌడ్కు కీలక బాధ్యతలు?

Dec 11 2015 9:37 AM | Updated on Mar 18 2019 9:02 PM

ముఖేష్ గౌడ్కు కీలక బాధ్యతలు? - Sakshi

ముఖేష్ గౌడ్కు కీలక బాధ్యతలు?

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు.

హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. నగర కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా? లేక పీసీసీలో మరేవైనా బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ఏఐసీసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

 

రెండు రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలు ముఖేష్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ను కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ ముఖేష్ గౌడ్కు నగర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే... దానం నాగేందర్కు ఏఐసీసీ లేదా పీసీసీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా చర్చించినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement