ఆస్తి కోసం కూతురిని చంపిన తల్లి | mother kills daughter in property dispute | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కూతురిని చంపిన తల్లి

Sep 19 2014 1:00 PM | Updated on Jul 30 2018 8:29 PM

కన్నతల్లే.. తన పేగు తెంచుకుని పుట్టిన కూతురిని కత్తితో నరికి చంపిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.

ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను గెంటేసే పిల్లలను ఇంతకుముందు చూశాం. కానీ, కన్నతల్లే.. తన పేగు తెంచుకుని పుట్టిన కూతురిని కత్తితో నరికి చంపిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సంఘటన యూసుఫ్గూడ లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి (25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి (50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తిపట్టుకుని నిలబడింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు. అంతా కలిసి లక్ష్మీనగర్లో నివాసం ఉంటారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీటి కారణంగా మిగిలిన ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ ధ్వంసం చేసి.. ఆ తర్వాత ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement