పాతబస్తీలో తల్లి, కూతురు దారుణ హత్య | mother, daughter murdered in hyderabad chatrinaka | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో తల్లి, కూతురు దారుణ హత్య

Apr 25 2016 9:46 AM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీఎంచౌనిలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతురు అనూహ్యంగా మరణించారు.

హైదరాబాద్: నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీఎంచౌనిలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతురు అనూహ్యంగా మరణించారు. తెల్లవారే సరికి వారి మెడలు కోసి ఉన్నాయి. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారితోపాటు ఉండే భర్త కనిపించకుండాపోయాడు. దీంతో స్థానికులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement