క్యాష్ కష్టాలు.. | money problems in city | Sakshi
Sakshi News home page

క్యాష్ కష్టాలు..

Nov 27 2016 12:08 AM | Updated on Sep 4 2017 9:12 PM

క్యాష్ కష్టాలు..

క్యాష్ కష్టాలు..

బ్యాంక్‌లకు నాలుగో శనివారం సెలవు కావడంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పలేదు.

బ్యాంక్‌లకు నాలుగో శనివారం సెలవు కావడంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పలేదు. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు సైతం పనిచేయకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేసింది. నగదు ఉన్న ఏటీఎంల వద్ద భారీగా క్యూలు కనిపించారుు. పలుచోట్ల ‘నో సర్వీస్, నో క్యాష్ బోర్డులు’ దర్శనం ఇచ్చారుు.

ఇవి ఎప్పుడైనా పనిచేయవచ్చన్న నమ్మకంతో పలువురు వాటివద్దే పడిగాపులు కాశారు. నిత్యం వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే శంషాబాద్ విమానాశ్రయంలో సైతం ఏటీఎంలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చారుు. దీంతో ప్రయాణికులతో పాటు వారి వెంట వచ్చినవారు డబ్బుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. - సాక్షినెట్‌వర్క్

 

Advertisement
 
Advertisement
Advertisement