ఏసీబీ కేసులో మోహన్‌రెడ్డి అరెస్టు | Mohan reddy arrested on ACB case | Sakshi
Sakshi News home page

ఏసీబీ కేసులో మోహన్‌రెడ్డి అరెస్టు

Apr 11 2017 2:41 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంలో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్‌ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టు లో హాజరుపరిచారు. న్

-ఈ నెల 24 వరకు రిమాండ్‌
కరీంనగర్‌‌:
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంలో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన కరీంనగర్‌ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టు లో హాజరుపరిచారు. న్యాయమూర్తి పి.భాస్కరావు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు.  

మోహన్‌రెడ్డి ఆదాయం కన్నా  ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారని, కుటుం బ సభ్యుల పేర ఆస్తులు చూపి బినామీలు గా చేర్చారని రిమాండ్‌ షీట్‌లో పేర్కొన్నా రు.  ఆస్తుల విలువ రూ.3 కోట్ల 27 లక్షల 39 వేలుగా చూపారు. 2015లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.శ్రీని వాస్‌  ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు చేయగా విచారణ జరిపి సోదాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement