దుర్యోధన, దుశ్శాసనుల పార్టీ టీడీపీ | mla rk roja fire on chandrababu on ministers and tdp leaders attacks on women | Sakshi
Sakshi News home page

దుర్యోధన, దుశ్శాసనుల పార్టీ టీడీపీ

Dec 25 2016 12:49 AM | Updated on Oct 29 2018 8:08 PM

దుర్యోధన, దుశ్శాసనుల పార్టీ టీడీపీ - Sakshi

దుర్యోధన, దుశ్శాసనుల పార్టీ టీడీపీ

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులు కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదు, ఊసరవెళ్లి కన్నా వేగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు,ఎమ్మెల్యే రోజా ధ్వజం
గుంటూరు చైర్‌పర్సన్‌ జానీమూన్‌ ఆవేదనే నిదర్శనం


సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో మహి ళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాల ప్రదేశ్, అఘాయిత్యాల ప్రదేశ్‌గా మార్చే శారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. మంత్రి రావెల కిశోర్‌ బాబు తొమ్మిది నెలలుగా వేధిస్తున్నారంటూ టీడీపీకే చెందిన గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ బహిరంగంగా చెప్పడాన్ని చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏపాటి రక్షణ ఉందో అర్థమవుతోందన్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఆ తర్వాత మంత్రి నుంచి వేధింపులు మరిం త ఎక్కువయ్యాయని జానీమూన్‌ కన్నీరు పెట్టుకో వడం అందర్నీ కలచి వేస్తోంద న్నారు.

టీడీపీని దుర్యోధనులు, దుశ్శాసనులు, పార్టీగా మార్చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దే వా చేశారు. రోజా శనివారం విశాఖ సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అది ఏ కొనుగోలో చెప్పాలి: మా పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను నగదు ఇచ్చి తీసుకెళ్లారా? లేక నగదు రహిత లావాదేవీల ద్వారా తీసుకెళ్లారా? అనేది చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో 170 స్థానాల్లో గెలుస్తామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు నిజంగా గెలిచే సత్తా ఉంటే వెంటనే ఎన్నికలకు రావాలని కోరారు. టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement