janimun
-
దుర్యోధన, దుశ్శాసనుల పార్టీ టీడీపీ
వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు,ఎమ్మెల్యే రోజా ధ్వజం గుంటూరు చైర్పర్సన్ జానీమూన్ ఆవేదనే నిదర్శనం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో మహి ళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాల ప్రదేశ్, అఘాయిత్యాల ప్రదేశ్‌గా మార్చే శారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. మంత్రి రావెల కిశోర్ బాబు తొమ్మిది నెలలుగా వేధిస్తున్నారంటూ టీడీపీకే చెందిన గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ బహిరంగంగా చెప్పడాన్ని చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏపాటి రక్షణ ఉందో అర్థమవుతోందన్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఆ తర్వాత మంత్రి నుంచి వేధింపులు మరిం త ఎక్కువయ్యాయని జానీమూన్ కన్నీరు పెట్టుకో వడం అందర్నీ కలచి వేస్తోంద న్నారు. టీడీపీని దుర్యోధనులు, దుశ్శాసనులు, పార్టీగా మార్చేసిన ఘనత బాబుకే దక్కుతుందని ఎద్దే వా చేశారు. రోజా శనివారం విశాఖ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అది ఏ కొనుగోలో చెప్పాలి: మా పార్టీ (వైఎస్సార్సీపీ) ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను నగదు ఇచ్చి తీసుకెళ్లారా? లేక నగదు రహిత లావాదేవీల ద్వారా తీసుకెళ్లారా? అనేది చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 170 స్థానాల్లో గెలుస్తామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు నిజంగా గెలిచే సత్తా ఉంటే వెంటనే ఎన్నికలకు రావాలని కోరారు. టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా తేల్చిచెప్పారు. -
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది..
-
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది
విలేకర్ల ఎదుట బోరున విలపించిన జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ గుంటూరు(కొరిటెపాడు): సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణి అవలంబిస్తున్నారని, తాను చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే.. మీ అంతు చూస్తాను అం టూ బెదిరించారని, తన మనుషులను ఇంటి కి పంపి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నా రంటూ విలేకరుల ఎదుట బోరున విలపించారు. స్థానిక జిల్లా పరిషత్ కాంపౌం డ్లోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాకుమాను మండలం గరికపాడులో జరిగిన చంద్రన్న రుణ ఉపశమన పత్రాల పంపిణీ సభలో తమపై రాళ్లదాడి చేయాలంటూ మంత్రి రావెల తన అనుచరులను పురిగొల్పారని ఆరోపించారు. తన సొంత మండలం కాకుమానులో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం తెలియనీయవద్దని, ఆహ్వానించవద్దని అధికారులు, పార్టీ నాయకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తన కుటుంబానికి ప్రాణహాని వుందని రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. చలి చీమలను చంపాలన్నా భయపడతా!: రావెల చలి చీమలను చంపాలన్నా తాను భయపడతానని, అలాంటిది కన్న కూతురు లాంటి జెడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ కు హాని తలపెడతాననడం హాస్యాస్పదంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పుడు మాటలు వల్లే తనపై జానీమూన్ ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. -
మంత్రి రావెల నుంచి మాకు ప్రాణహాని ఉంది