'రూ.50 కోట్లివ్వండి.. పేదల కష్టాలు తీరతాయి' | MLA kotam reddy asked governement 50 crores for poor people | Sakshi
Sakshi News home page

'రూ.50 కోట్లివ్వండి.. పేదల కష్టాలు తీరతాయి'

Mar 8 2016 10:36 AM | Updated on Oct 29 2018 8:29 PM

నెల్లూరులో పేదల ఇళ్ల నిర్మాణంలో సౌకర్యాలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: నెల్లూరులో పేదల ఇళ్ల నిర్మాణంలో సౌకర్యాలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని భావించినా రూ.50కోట్ల నిధులు ఇస్తే పేదలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

తాము కోరినట్లు నిధులిచ్చి పేదలకు మేలుచేయాలని కోరారు. ఇప్పటికే జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని మంత్రి కూడా ఒప్పుకున్నారని, ఈ సమస్యను కూడా దృష్టిలోకి తీసుకోవాలన్నారు. మంచి నీటి కొరత కూడా అధికంగా ఉందని దాన్ని కూడా తీర్చాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement