ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు | Minister Narayan comments on job | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు

Mar 16 2016 3:54 AM | Updated on Sep 3 2017 7:49 PM

ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు

ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు

రాజధానికోసం భూములిచ్చిన రైతులు, కౌలురైతులు, నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగమిస్తామని...

శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పాం: మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజధానికోసం భూములిచ్చిన రైతులు, కౌలురైతులు, నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగమిస్తామని ఊరూరా తిరిగి చెప్పిన పురపాలక మంత్రి నారాయణ ఇప్పుడు మాటమార్చారు. మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదన్నారు. తాము శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఉప్పులేటి కల్పన, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో ఇంటికొక ఉద్యోగంపై ప్రశ్నించారు.

మంత్రి సమాధానమిస్తూ... ప్రతి కుటుంబానికి ఉద్యోగం మినహా మిగిలిన అన్నింటినీ సమకూర్చడానికి తాము హామీ ఇచ్చామని చెప్పారు. సీఆర్‌డీఏ క్లాజులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. రాజధాని ప్రాంత రైతులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెచ్చగొడుతున్నారంటూ ఊగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement