breaking news
intiko job
-
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు
శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పాం: మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: రాజధానికోసం భూములిచ్చిన రైతులు, కౌలురైతులు, నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగమిస్తామని ఊరూరా తిరిగి చెప్పిన పురపాలక మంత్రి నారాయణ ఇప్పుడు మాటమార్చారు. మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదన్నారు. తాము శిక్షణ మాత్రమే ఇస్తామని చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఉప్పులేటి కల్పన, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో ఇంటికొక ఉద్యోగంపై ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ... ప్రతి కుటుంబానికి ఉద్యోగం మినహా మిగిలిన అన్నింటినీ సమకూర్చడానికి తాము హామీ ఇచ్చామని చెప్పారు. సీఆర్డీఏ క్లాజులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. రాజధాని ప్రాంత రైతులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెచ్చగొడుతున్నారంటూ ఊగిపోయారు. -
జిల్లా ఉపాధి కార్యాలయం ముట్టడి
పాతగుంటూరు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి డిమాండ్ చేశారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. ముందుగా కొత్తపేటలో ఉన్న మల్లయ్యలింగం భవన్ నుంచి కార్యకర్తలు, నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యస్వామి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, లేకుండే నిరుద్యోగభృతికింద నె లకు రూ. 3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భార్తీ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, బీఈడీ విద్యార్థులకు ఎస్జీటీలోఅవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చల్లగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలను స్థాపించి స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఏఐవైఎఫ్ కార్యకర్తలు, నిరుద్యోగులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు వాగ్వివాదం, తోపులట జరిగింది. ఐవైఎఫ్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ముట్టడి కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.రవీంద్ర, రామకృష్ణ, వేమూరి సుబ్బారావు, చిన్న తిరుపతయ్య, సుభాని, అరుణ్‌కుమార్, రమేష్, వెంకటేష్, మాత్రునాయక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.