జిల్లా ఉపాధి కార్యాలయం ముట్టడి | The siege of the district employment office | Sakshi
Sakshi News home page

జిల్లా ఉపాధి కార్యాలయం ముట్టడి

Sep 11 2014 2:40 AM | Updated on Sep 2 2017 1:10 PM

జిల్లా ఉపాధి కార్యాలయం ముట్టడి

జిల్లా ఉపాధి కార్యాలయం ముట్టడి

పాతగుంటూరు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి డిమాండ్ చేశారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం,

పాతగుంటూరు
 ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి డిమాండ్ చేశారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు. ముందుగా కొత్తపేటలో ఉన్న మల్లయ్యలింగం భవన్ నుంచి కార్యకర్తలు, నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా అయ్యస్వామి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, లేకుండే నిరుద్యోగభృతికింద నె లకు రూ. 3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భార్తీ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, బీఈడీ విద్యార్థులకు ఎస్‌జీటీలోఅవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి చల్లగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలను స్థాపించి స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఏఐవైఎఫ్ కార్యకర్తలు, నిరుద్యోగులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు వాగ్వివాదం, తోపులట జరిగింది. ఐవైఎఫ్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ముట్టడి కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.రవీంద్ర, రామకృష్ణ, వేమూరి సుబ్బారావు, చిన్న తిరుపతయ్య, సుభాని, అరుణ్‌కుమార్, రమేష్, వెంకటేష్, మాత్రునాయక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement