5కే రన్‌ను ప్రారంభించిన నగర మేయర్ | Mayor started 5 K ran | Sakshi
Sakshi News home page

5కే రన్‌ను ప్రారంభించిన నగర మేయర్

Apr 3 2016 10:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

స్వచ్ఛతలో దేశంలో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

స్వచ్ఛతలో దేశంలో 19వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని మొదటి స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. స్వచ్ఛ సాగర్ పేరుతో నెక్లెస్‌రోడ్‌పై ఏర్పాటు చేసిన రన్‌లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ రోజు 5కే, 10కే రన్ లు, సైక్లింగ్ పోటీలను నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ జండా ఊపి రన్‌ను ప్రారంభించగా.. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను స్వచ్ఛంగా పచ్చదనంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement