
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ ప్రాంగణం దాండియా వేడుకలకు వేదిక కానుంది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకూ నవకర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్–2025 సీజన్–8 పేరుతో దీనిని నిర్వహించనున్నారు. మానేపల్లి జ్యువెలర్స్, అన్విత సమర్పణలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాస్ పోస్టర్‌ను బాలీవుడ్ గర్భా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, ఆర్గనైజర్లు కవిత, సలోని జైన్‌తో కలిసి ఆదివారం ఆవిష్కరించారు.
వేడుకల్లో భాగంగా ప్రతి రోజూ గర్భా, దాండియా, సంగీతం, మహా ఆర్తి, లైవ్ ఢోలు, ఫుడ్ కోర్టులు, సెలబ్రిటీల కార్యక్రమాలు, ప్రత్యేక బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కొరియోగ్రాఫర్ సోని ఆధ్వర్యంలో యువతకు గర్భా, దాండియా నృత్యంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్, దాండియా నృత్యాలు అలరించాయి.
(చదవండి: గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..)