హార్ట్‌ ఫేవరెట్‌.. హార్టికల్చర్‌ షో : రూ.30 నుంచి 3 లక్షల దాకా! | 18th Nursery Mela 2025 Begins at People’s Plaza Hyderabad | Sakshi
Sakshi News home page

హార్ట్‌ ఫేవరెట్‌.. హార్టికల్చర్‌ షో : రూ.30 నుంచి 3 లక్షల దాకా!

Sep 19 2025 12:23 PM | Updated on Sep 19 2025 12:48 PM

all India Horticulture & Agriculture Show 2025 At hyderabad

సందడిగా నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజా 

రూ.30 నుంచి రూ.3 లక్షల ధరల్లో మొక్కలు 

గార్డెనింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటున్న నర్సరీ ప్రదర్శన

నగర వేదికగా ప్రకృతి ప్రేమికుల హార్ట్‌ ఫేవరెట్‌ అయిన హారి్టకల్చర్‌ షో మరో మారు అలరిస్తుంది. నక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా ఈ 18వ నర్సరీ మేళా–2025 గురువారం గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల మొక్కలు రూ.30 నుంచి రూ.3 లక్షల ధరల్లో గార్డెనింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నగరవాసులకు అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.     – ఖైరతాబాద్‌/లక్డీకాపూల్‌

 రాష్ట్ర ఉద్యానవన శాఖ టెర్రస్‌ గార్డెన్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రీనరీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని నర్సరీ మేళా పేరుతో ఆల్‌ ఇండియా హారి్టకల్చర్‌ షో అందుబాటులోకి తీసుకొచ్చింది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకొచ్చి 150 స్టాళ్లలో ఏర్పాటు చేశారు. కిచెన్, అవుట్‌డోర్, బల్బ్, సీడ్, సీడ్‌లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్‌ ప్లాంట్స్‌తో పాటు ఎగ్జాటిక్‌ ప్లాంట్స్, వాటర్‌ లిల్లీస్, కోకో పీట్, గార్డెన్‌ ఎక్విప్‌మెంట్, ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.  

చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!

ఎగ్జాటిక్‌ ప్లాంట్స్‌ ప్రత్యేకం.. 
నర్సరీ మేళాలో వెస్ట్‌ బెంగాల్‌లోని కాలీపంగ్‌ నుంచి ప్రత్యేక ఎగ్జాటిక్‌ ప్లాంట్స్‌ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రదర్శన ఇన్‌ఛార్జి ఖాలీద్‌ అహ్మద్‌ పేర్కొంటున్నారు. ఈ మేళాలో ఏపీ, కడియం, కోల్‌కతా, ఢిల్లీ, హర్యాణ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, వెస్ట్‌ బెంగాల్‌ తదితర ప్రాంతాల నర్సరీలు భాగస్వామ్యం అయ్యాయి. నాటు కూరగాయలు, బొబ్పాయి, మునగ మొక్కలతో స్నేహ నర్సరీ ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి అనుకూలమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement